సికింద్రాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. వైద్యం పేరుతో మహిళల్ని లాడ్జికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోపిడి చేస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విక్రాంత్ రెడ్డి అనే నకిలీ డాక్టర్ పై సికింద్రబాద్ లో గత వారం కేసు నమోదయ్యింది.
ఉస్మానియా గాంధీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తానంటూ మాయమాటలు చెప్పి మహిళలను లాడ్జీకి తీసుకెళ్లేవాడు విక్రాంత్ రెడ్డి. అక్కడ మత్తు మందు ఇచ్చి నగలు,డబ్బు దోచుకునేవాడు. ఏపీ, తెలంగాణలో ఇలా చాలా మంది మహిళల వద్ద దోపిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. విక్రాంత్ రెడ్డి తాను వీఐపీ అనే బిల్డప్తిస్తూ బౌన్సర్లు, గన్ మెన్లను పెట్టుకొని తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.