కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేక్​ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణీ అవుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేక్​ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణీ అవుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు
  • ఇటీవల ఉమ్మడి జిల్లాలో పట్టుబడిన 10 మంది నకిలీ డాక్టర్లు 
  • అర్హత లేకపోయినా క్లినిక్‌‌‌‌‌‌‌‌లు, నర్సింగ్‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ 
  • వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం 
  • విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌‌‌‌‌‌‌‌ వినియోగానికి సిఫారసు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలవరపెడుతోంది. కేవలం ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎయిడ్‌‌‌‌‌‌‌‌కే పరిమితం కావాల్సిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు.. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హతలు లేకపోయినా 5 నుంచి 10 బెడ్లతో క్లినిక్స్, నర్సింగ్ హోమ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. ప్రిస్కిప్షన్లు రాయడం, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తూ వచ్చీరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) గత ఆర్నెళ్లుగా వరుస దాడులు నిర్వహిస్తోంది. 

ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన దాడుల్లో రాష్ట్రంలో 40 మందిని గుర్తించి కేసులు నమోదు చేయగా.. వారిలో కరీంనగర్ జిల్లాకు చెందినవారే ఏడుగురు ఉన్నారు. మూడు రోజుల కింద కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా సమీపంలో ఎలాంటి అనుమతుల్లేకుండా ఒక ఆర్ఎంపీ ‘శ్రీసాయి సాహిత్’ పేరిట హాస్పిటల్ నిర్వహిస్తూ టీజీఎంసీ బృందానికి చిక్కాడు.

ఉమ్మడి జిల్లాలో టీజీఎంసీ టీం దాడులు.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అర్హత లేకుండా నిర్వహిస్తున్న మూడు క్లినిక్‌‌‌‌‌‌‌‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు జులైలో దాడులు నిర్వహించారు. క్లినిక్‌‌‌‌‌‌‌‌లలో ప్రిస్క్రిప్షన్లు రాయడం, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడంతోపాటు క్లినిక్‌‌‌‌‌‌‌‌లలో ఇన్‌‌‌‌‌‌‌‌పేషెంట్లను చేర్చుకుంటున్నారు. గతంలో  కరీంనగర్ పట్టణంలోని వెంకటేశ్వర క్లినిక్, లక్ష్మీ క్లినిక్, లలిత పాలిక్లినిక్‌‌‌‌‌‌‌‌లపై దాడులు నిర్వహించి సీజ్ చేశారు. 

 గోదావరిఖనిలో నిర్వహించిన టీజీఎంసీ తనిఖీల్లో శ్రీనివాస క్లినిక్ పేరుతో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. శివ అనే వ్యక్తి ‘శివ పైల్స్ క్లినిక్‌‌‌‌‌‌‌‌’ పేరిట నిర్వహిస్తున్న హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. వీటిల్లో విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్, ఫైరోయిడ్స్ ఇస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఎన్ఎంసీ చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసు నమోదు చేశారు. 
ఆగస్టులో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ లో నకిలీ అల్లోపతి డాక్టర్ల క్లినిక్స్ పై  తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పెద్దపల్లిలోని లోటస్ హాస్పిటల్, ఇమ్రాన్ బోన్ సెట్టింగ్స్ సెంటర్, వైఎస్ అజీజ్ క్లినిక్, సుల్తానాబాద్ లోని నీలకంఠేశ్వర్ మెడికల్ షాప్ పేరిట ఎలాంటి అర్హత లేకుండా కొందరు వైద్యం చేస్తునట్లు  టీజీఎంసీ టీం గుర్తించారు.  

నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌‌‌‌‌‌‌‌. 

నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ - 2019, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రూల్స్ 2013, టీఎంపీఆర్ యాక్ట్ 1968 ప్రకారం అర్హత లేకుండా క్లినిక్‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తున్న వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేస్తోంది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ  2019లోని సెక్షన్ 34 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషినర్ కాకుండా మరెవ్వరూ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించేవారికి ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధించాలని చట్టం చెప్తోంది.

‘శంకరపట్నం మండలం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి  గ్రామానికి చెందిన  ముంజ లక్ష్మయ్య(42)కు  వ్యవసాయ పనులకు వెళ్లగా వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో స్థానిక ఆర్ ఎంపీ ధవరావు అలియాస్ మధు వద్దకు వెళ్లగా ఆయనకు 2 ఇంజక్షన్లు వేసి పంపించాడు. మరుసటి రోజు మరో రెండు యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేసి రెండు సెలైన్ బాటిల్ ఎక్కించడంతో చలికి లక్ష్మయ్య వణికిపోయాడు. ఇంటికి వెళ్లిన ఆయన పాలు తాగి గిలగిలా కొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. చేతులెత్తిసినా ఆయన హనుమకొండకు తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.’ 

నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి 

కరీంనగర్ సిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఎలాంటి విద్యార్హత లేకున్నా అత్యాధునిక వైద్యం పేరిట ప్రజలను దోపిడి గురి చేస్తున్న  నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ లో సాహితి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలి. - బి.యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి