రూ.4 కోట్ల నకిలీ మందులు పట్టివేత.. ఫార్మా కంపెనీ సీజ్

నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డిసెంబర్ 23వ తేదీ  ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా  అనుమతులు లేకుండా నడుస్తున్న యాస్ప్రిన్ బయో ఫార్మసీ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు.  

నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈరోజు తెల్లవారుజామున.. ఫార్మకంపెనీపై అధికారులు అకస్మిక తనిఖీలు చేసీ 28 బ్యాగులలో నిలువ ఉంచిన 9 క్వింటాల 35 కిలోల మెటీరియల్ తో సహా రూ. 4 కోట్ల 35 లక్షల విలువైన నకిలీ మందులు పట్టుకున్నారు. అనంతరం  కంపెనీని అధికారులు సీజ్ చేసి తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  దాడులతో ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరబాద్ లో సతీష్ రెడ్డికి చెందిన కంపెనీలో ఇప్పటికే దాదపు రూ. 5 కోట్ల మెటిరీయల్ ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సతీష్ రెడ్డితోపాటు ఉన్న ఉపేందర్ రెడ్డి కోసం  పోలిసులు గాలిస్తున్నారు.