కర్నూలు: ఇన్సూరెన్సు డబ్బులు.. వచ్చాయని.. సీఎం సహాయ నిధి ఆర్ధిక సహాయం మంజూరైందని ఆశలు రేపి.. వారి నుండి డబ్బులు వసూలు చేసి తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి మొహం చాటేస్తున్న నకిలీ డీఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. తరచూ మొబైల్ ఫోన్ నెంబర్లు మార్చేసి తిరుగుతున్న నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులకు లింగం దిన్నె గ్రామం వద్ద ఉండడంతో మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సగ్గల కిరణ్ కుమార్ అలియాస్ రవి కుమార్ ను కర్నూలు దిశ మరియు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వెంకట్రామయ్య మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి వారు.. లేదా ముఖ్యమైన వ్యక్తి చనిపోతే వారి వివరాలు తెలుసుకుని బాధితులు ఆలోచించుకునేందుకు లేదా విచారించుకునేందుకు అవకాశం లేకుండా మోసానికి పాల్పడుతున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదవశాత్తూ లేక వివిధ కారణాల వల్ల అసహజముగా మరణము అంటే గుండెపోటు, పురుగుల మందు త్రాగి, ఉరివేసుకొని చనిపోయిన వ్యక్తుల పేర్లు వారి వివరములు చాలా తెలివిగా సేకరించేవాడు. ఇంటర్ నెట్ లో.. ఆన్ లైన్ దిన పత్రికలలో ప్రచురించిన్న వార్తలను చూసి, ముద్దాయి మరణించిన వారి రక్త సంబంధికుల ఫోన్ నంబర్లను సంబంధిత మండల అధికారులు అయిన ఎమ్మార్వో, వీఆర్వో పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకునేవాడు.
తాను ఇంటలిజెన్స్ డి.యస్.పి. అని తప్పుడు హోదా, పేరులు వాడుకొని మరణించిన వ్యక్తికి జీవిత భీమా లేదా ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద ఆర్థిక సహాయము మంజూరు అయినదని, మంజూరు అయిన నగదు మరణించిన వారి రక్తబందువుల బ్యాంక్ అక్కౌంట్ నంబర్ కు జమ కావాలంటే వెంటనే జీఎస్టీ మిగతా సర్విస్ ట్యాక్స్ ల కింద కొంత నగదు ఇదే నెంబరుకు గూగుల్ పే.. ఫోన్ పే.. పేటీఎంల ద్వారా జమ చేయాలని చెప్పేవాడు. అలా జమ చేస్తేనే మీకు మంజూరు అయిన నగదు వస్తుంది లేదంటే రాదు అని చెప్పేవాడు. ఆలోచింకుకునే లేదా.. విచారించుకునే సమయము ఇవ్వకుండా ఈ రోజే చివరి రోజు అని తాను చెప్పిన ట్యాక్సు డబ్బులను చెప్పిన అక్కౌంట్ వేయకపోతే మంజూరు అయిన నగదు ఆగిపోతుందని చెప్పి ఆశపెట్టేవాడు. బాధితులు డబ్బులు వేసిన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు.
నిందితుడి కదలికలపై నిఘా పెట్టగా కర్నాటక లోని రాయచూరు, బళ్ళారి, హుబ్లీ, మంగళూరు, బెంగళూరు మొదలగు ప్రదేశములో తిరుగుతుండేవాడు. కర్నూల్ లో ఉన్న తన తల్లి శేషమ్మను కలవడానికి వస్తుండగా లొకేషన్ ను ట్రేస్ చేశారు. కోడుమూర్ ఊరి చివర లింగందిన్నె గ్రామ బస్ స్టాప్ వద్ద ఉండగా గోనెగండ్ల పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుండి రెండు సెల్ ఫోన్ లు, రూ. 25,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడని పత్తికొండ కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ కు ఆదేశించినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య వివరించారు. నిందితుడి ఆచూకీ కనుగొని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన గోనెగండ్ల సబ్ ఇన్స్ పెక్టర్ సి. శరత్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది హెచ్.సి. ఏ. చంద్ర శేఖర్, కానిస్టేబుళ్లు యమ్.సి. రంగారావు, బాబు నాయక్, వేణుగోపాల్, రాజేంద్ర లను అభినందించారు. ఇలాంటి వ్యక్తులు చేసే మోసాల బారిన పడకుండా అప్రమత్తము ఉండాలని.. ఎవరైనా ఫోన్ చేసి డబ్బు వస్తుందని చెబితే సబంధిత పోలీసులకు సమాచారము ఇవ్వాలని డీఎస్పీ బి.వెంకట్రామయ్య కోరారు.
చలికాలంలో న్యుమోనియాను అడ్డుకోండిలా..
https://www.v6velugu.com/prevent-pneumonia-in-winter-season/
ఇడ్లీ సాంబార్ అంటే మస్త్ ఇష్టం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి
https://www.v6velugu.com/american-vice-president-contestant-kamala-harris-says-i-like-idli-sambar/