తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్ చేశారు.. ఫేక్ ఐడీ కార్డులతో రోజుకో వ్యక్తి సచివాలయంలోకి ఎంటర్ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.. రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నామని సచివాలయ భద్రతా సిబ్బంది తెలిపారు. గురువారం ( ఫిబ్రవరి 6, 2025 ) మరో ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నట్లు తెలిపారు సచివాలయ భద్రతా సిబ్బంది. తహసీల్దార్ పేరిట కొంపల్లి అంజయ్య అనే సచివాలయంలోకి వచ్చారని.. తహసీల్దార్ అనే స్టిక్కర్ వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు సిబ్బంది.
ALSO READ | తీన్మార్ మల్లన్నకు TPCC క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్
అంజయ్యపై అనుమానం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని పరిశీలించగా బండారం బయటపడిందని తెలిపారు సిబ్బంది. అంజయ్యను పట్టుకున్న సచివాలయ భద్రతా సిబ్బంది అతడిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.అతని దగ్గర నుంచి ఫేక్ ఐడి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒక జిరాక్స్ సెంటర్ లో ఫేక్ ఐడి కార్డ్ తయారు చేయించినట్లు విచారణలో వెల్లడయ్యిందని తెలిపారు పోలీసులు. అంజయ్యపై కేసు నమోదు చేసి ఫేక్ ఉద్యోగి దందాల పై విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు.