ఓ హోటల్‌కు వెళ్లి ఇద్దరు మహిళల హడావిడి
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీ నగర్లో ఫుడ్ సేప్టీ అధికారులమంటూ ఇద్దరు మహిళలు ఓ హోటల్లో హడావిడి చేశారు. చింతలకుంటలో క్రితుంగ హోటల్‌కు మంగళవారం వెళ్లిన వీరు కిచెన్‌ను పరిశీలించారు.అందులో ఓ మహిళ తనను డాక్టర్ విజయలక్ష్మిగా హోటల్ సిబ్బందితో పరిచయం చేసుకుంది. తాను ఢిల్లీ నుంచి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారిని అంటూ తెలిపింది.
వీరు అనుమానాస్పదంగా ఉండడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, ఢిల్లీ నుంచి ఎటువంటి ఫుడ్ సెప్టీ అధికారులు రాలేదని జీహెచ్ఎంసీ చీఫ్ ఫుడ్ సేప్టీ అధికారి తెలిపారు. అయితే, వచ్చిన మహిళలు అసలు ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది.