తెలంగాణ,ఏపీలలో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు దండుకున్న ముఠాను వరంగల్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గ్యాంగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్త వీరేశం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పరారీలో మరో 8మంది నిందితులు కోసం సెర్చ్ చేస్తున్నారు. నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, నగదను పోలీసులుల సీజ్ చేశారు.
కొంతమంది కలిసి టీమ్ గా ఏర్పడి ఏపీ,తెలంగాణ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. మోసపోయిన వాళ్లల్లో మాజీ అడిషనల్ ఎస్పీ కుటుంబం కూడా ఉంది. రిటైడ్ అడిషనల్ ఎస్పీ భార్య వారం శ్రీదేవి అనే మహిళ నుంచి నిందితులు రూ.2.5 కోట్లు వసూలు చేశారు.
ఆమె కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. మొత్తంగా ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 4.5 కోట్లు ఉద్యోగాల పేరుతో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నారు.