బాధితుడిని ఫూల్ చేసిన పోలీసులు: చోరీ కేసులో నకిలీ బంగారం అప్పగింత

వరంగల్ , వెలుగు: చోరీ కేసులో పోలీసులు బాధితుడికి అసలు నగలకు బదులు డూప్లికేట్ నగలు అప్పగించిన సంఘటన వరంగల్ లో వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపి న వివరాల ప్రకారం.. వేలేరు మండలం మల్లికు దుర్లకు చెందిన నార్లగిరి వెంకటరాజ్యం కారు మెకానిక్ గా పని చేస్తూ.. భార్య వాణి, కొడుకుతో కలిసి హన్మకొండ సుబేదారి సమీపంలోని ఎస్ బీహెచ్ సమీపంలో ఉంటున్నాడు. నవంబర్ 13న తన తండ్రి చనిపోవడంతో ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి సొంతింటికి వెళ్లాడు. పది రోజుల తరువాత ఇరుగుపొరుగు వాళ్లు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని చెప్పడంతో హుటాహుటిన వచ్చి చూడగా.. సామానంతా చిందరవందరగా పడి ఉంది. ఇంట్లో ఉన్న రెండు తులాల
బంగారు నగలు, 32 తులాల వెం డి చోరీకి గురైనట్లు గుర్తించి వెంకటరాజ్యం వెంటనే సుబేదారి స్టేషన్ కు వెళ్లి నవంబర్ 24న కంప్లైంట్ ఇచ్చాడు.
తమవి కాకున్నా అంటగట్టి.. తనకు పరిచయం ఉన్న వ్యక్తే చోరీ చేసి ఉంటాడనే అనుమానంతో బాధితుడు సోమిడి గ్రామానికి వెళ్లి అదే రోజు రాత్రి దొంగను పట్టించా డు. విచారణ చేపట్టి దొంగ చెప్పిన అడ్రస్ కు వెళ్లి పోలీసులు బంగారం రికవరీ చేశారు. అనంతరం చోరీ అయిన బంగారం ఇదేనా అంటూ డిసెంబర్ 6న వాటికి సంబంధించిన ఫొటోలను పోలీసులు వెంకటరాజ్యంకు వాట్సాప్ లో పంపించారు. పెళ్లిలో అత్తగారు
పెట్టినవి, ఇవి తేడాగా ఉండటంతో అదే విషయాన్ని చెప్పేశారు. అయినా పోలీసులు గదమాయించి మరీ ‘కోర్టులో మీ నగలేనని ఒప్పుకోవాలి. లేదంటే మీకు నగలు రావు’ అంటూ ఒత్తిడి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడంతో జనవరి 6న కోర్టులో ఆ నగలనే బాధితుడికి అంటగట్టారు.

ప్యూరిటీ టెస్ట్ తో బట్టబయలు..

దొంగ నగలు కుదువ పెట్టిన షాపు దగ్గర్లోనే ఉన్నా..పోలీసులు తమవి కాకుండా వేరే నగలు అప్పగించడంతో అనుమానం వచ్చిన బాధితులు తెలిసి న గోల్డ్ స్మిత్ దగ్గర ప్యూరిటీ టెస్ట్​ చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వారికి అంటగట్టిన దాంట్లో రాగి ఎక్కు వగా మిక్స్​ అయిందని, 20 గ్రాముల్లో 8 గ్రాములు మాత్రమే బంగారం ఉందని తేలింది. పట్టగొలుసుల పరిస్థితి అలాగే ఉండటంతో బాధితులు ఖంగుతిన్నా రు. వెంటనే సుబేదారి స్టేషన్ కు వెళ్లి మళ్లీ కలిశారు. అయినా అక్కడి ఆఫీసర్లు రోజులు దాటవేస్తూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు.
సీపీ ఆఫీస్ కు వెళ్లినా..
అసలే నిరుపేద కుటుంబం కావడం.. రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధితుడు చేసేది లేక నేరుగా జనవరి 28న పోలీసు కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అక్కడి ఆఫీసర్లు వారం రోజుల్లో సమస్యను సాల్వ్​ చేస్తామని చెప్పినా.. ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై స్పె షల్ ఆఫీసర్ తో విచారణకు ఆదేశించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు
చెబుతున్నా రు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. చాలా కేసుల్లోనూ పోలీసులు ఇలాగే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కేసుల్లో రికవరీ చేసిన సొమ్ము కాకుండా వేరే వాటిని చూపుతున్నారని, ఇంకొన్ని కేసుల్లో నగలు, నగదు తక్కు వ చేసి చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి .