
శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో నకిలీ కిరాణా వస్తువుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, నలుగురిని అరెస్టు చేశారు. మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ వివరాల ప్రకారం.. కాటేదాన్ మధుబన్ కాలనీలో నకిలీ కిరాణా వస్తువులు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేశారు.
ఘనోబా, ఖుషి, రీత, మనీషా అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నకిలీ బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్, తాజ్మహల్ టీ పౌడర్, వీల్ సర్ఫ్, పారాచూట్ ఆయిల్, కంఫర్ట్ కండిషనర్, క్లినిక్ ప్లస్ హెయిర్ షాంపూ, కార్న్ పౌడర్, బాడీ లోషన్ వంటి 20 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు
తెలిపారు.