బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఇన్స్టా అకౌంట్..డబ్బులు పంపాలని రిక్వెస్ట్

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. భిన్న విభిన్న పద్దతుల్లో  డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరుతో సోషల్ మీడియాలో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు. 

సైబర్ క్రిమినల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరుతోనే జనాలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల  సురేందర్ పేరిట  సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు. పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ లీడర్లు, ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. వారితో చాట్ చేస్తూ..అవసరం ఉంది.. డబ్బులు పంపించాలని వినతులు పంపిస్తున్నారు. 

తన పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సురేందర్ కు తెలియడంతో ...తన స్నేహితులు, ప్రజలకు సూచనలు చేశారు. తన పేరుమీదు కొందరు దుండగులు ఇన్ స్టాగ్రామ్ వేదికగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని..ఎవరికి మనీ పంపొద్దని చెప్పారు. ఆ అకౌంట్ ను బ్లాక్ చేయాలని కోరారు.