ఫేక్ న్యూస్ బ్యాన్ : వాట్సాప్ లో కొత్త ఫీచర్

ఫేక్ న్యూస్ బ్యాన్ : వాట్సాప్ లో కొత్త ఫీచర్

రాబోయే ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటుంది వాట్సాప్. ఫేక్ న్యూస్ ను బ్యాన్ చేసేందుకు కొత్త సాఫ్ట్ వేర్ ను తీసుకురానుంది. ‘రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌’ అనే ఫీచర్‌ ఫేక్ న్యూస్ ను అడ్డుకునేందకు ఉపయోగపడుతుందని వాట్సాప్‌ తెలిపింది. వాట్సాప్ చాట్‌ లో ఫొటోలు వచ్చినప్పుడు ..అవి ఫేక్ ఫొటోలు అని మీరు భావిస్తే.. ఆ ఫొటోను ఉపయోగించి ‘రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌’ ద్వారా దానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను స్క్రీన్‌ మీద చూడవచ్చు.

అలా అది నిజమైన ఫొటోనా కాదా కన్ఫమ్ చేసుకోవచ్చు కొత్తరకమైన ఎమోజీలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన ఎమోజీ, జెండాతో ఉన్న ఓ స్క్రీన్‌ షాట్‌ ను వినియోగదారులకు షేర్ చేసింది. ఈ జెండా యూఎన్‌, ఎల్‌ జీబీటీ జెండాల మధ్య ఉంటుందని తెలిపింది. వాట్సాప్‌ 2.19.73 బెటా వెర్షన్‌ వినియోగదారులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్‌ ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది వాట్సాప్.