హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 800 నుంచి 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. దాంతో నగర ప్రజలు గడపదాటాలంటేనే భయపడుతున్నారు. దాంతో కొంతమంది వ్యక్తులు కావాలనే ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారు. అక్కడ కరోనా సోకింది.. ఇక్కడ కరోనా సోకింది.. అక్కడ అంతమంది చనిపోయారు.. ఇక్కడ ఇంతమంది చనిపోయారు అని లేనిపోని పుకార్లు పుట్టించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా బార్కస్ లో 10 కరోనా మృతదేహాలు, డబీర్ పురాలో 25 కరోనా మృతదేహాలు గుట్టుచప్పుడు కాకుండా కాల్చేశారని కొన్ని వార్తలు ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఇవన్నీ ఫేక్ వార్తలని తేల్చారు. కరోనా వైరస్ విషయంలో ఫేక్ వార్తలు పుట్టించి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరించారు.
ఇలాగే బెంగుళూరులో కూడా రెండు రోజుల క్రితం ఓ ఫేక్ వార్త అందరినీ కలవరపెట్టింది. సిటీలోని కొన్ని బేకరీలు, రెస్టారెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు కరోనాసోకిందని వార్త పుట్టించారు. ఆ బేకరీలు, రెస్టారెంట్లు మరియు అవి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంటేనే మంచిదని ప్రచారం చేశారు. దాంతో బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ నగర కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. సిటిలో ఏ హోటల్ లేదా బేకరీ ఉద్యోగులకు కరోనా సోకలేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
For More News..