నకిలీ కరెన్సీని గుర్తించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ స్టూడెంట్లు సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను తయారు చేశారు. INR పేక్ నోట్ చెక్ గైడ్ అనే పేరుతో యాప్ తయారు చేశారు. చెక్ చేయాలనుకున్న నోటును ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. నోటు ఒరిజినలా? నకిలీనా చెప్పేస్తుంది. ఒరిజినల్ నోటులో ఉండాల్సిన 25 అంశాలను బేరీజు వేసుకుని నోటును చెక్ చేస్తుంది. నకిలీ నోటైతే ఎక్కడ తప్పుందో కూడా చూపిస్తుంది. ఇటీవలి స్మార్ట్ హాకథాన్ 2019లో స్టూడెంట్లు టీవైఎస్ఎస్ సంతోష్, సతీష్ కుమార్ రెడ్డి, విపుల్ తోమర్, సాయి కృష్ణ, దృష్టి తులసి, డీవీ సాయిసూర్య ఈ యాప్‌ను ప్రదర్శించారు. అప్లికేషన్‌ను అన్ని స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
రేడియేషన్‌ను గుర్తించే పరికరం న్యూక్లియర్ లో పని చేసే కార్మి కుల కోసం రేడియేషన్‌ను గుర్తించే మరో పరికరాన్ని మరో ఆరుగురు స్టూడెంట్లు లక్షే బన్సాల్, సీహెచ్ వీ సాయ్ ప్రవీణ్ , అదితి కాంబ్లీ , రాజశేఖర్ సింఘానియా, ఆయుశ్ మొహంతి , కౌస్తుభ్ అగర్వాల్ తయారు చేశారు. ఇదో త్రీడీ రేడియేషన్ డిటెక్టర్ సెన్సార్ అని, న్యూక్లి యర్ ప్ల ాంట్లు, రిఫైనరీల్లో ఎక్కడ రేడియేషన్ లీకవుతుందో పరికరం గుర్తిస్తుందని వారు చెప్ పారు. మార్చి 2, 3 తేదీల్లో జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో వీళ్లు బహుమతులు గెల్చుకున్నారు.