వీరెవర్రా బాబూ... దేవుడి హుండీలో దొంగనోట్లు

వీరెవర్రా బాబూ... దేవుడి హుండీలో దొంగనోట్లు

కామారెడ్డి జిల్లాలో దొంగ నోట్ల కలకలం రేగింది.  గాంధారి మండలంచద్మల్ తండాలో లక్ష్మమ్మ ఆలయం వద్ద మధుర లంబాడాల భోగ్ భండార్ జాతర జరిగింది.ఈ జాతరకు వేల సంఖ్యలో  వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.  హుండీలో ఎక్కువుగా రూ. 500 ల దొంగనోట్లను గుర్తించారు జాతర నిర్వాహకులు.  జాతర సమయంలో చద్మల్ తండా లక్ష్మమ్మ ఆలయం హుండీలో  1.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటి తెలిపింది. అయితే దొంగ నోట్ల విషయాన్ని  కొంతమంది సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగనోట్ల వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.