స్నేహితులే మోసం చేశారు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ చూపించి రూ. 8 లక్షలు కాజేశారు..

స్నేహితులే మోసం చేశారు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ చూపించి రూ. 8 లక్షలు కాజేశారు..

గవర్నమెంట్ జాబ్ ఆశ చూపి రూ. 8లక్షలు కాజేశారు కేటుగాళ్లు... మేడిపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... మేడిపల్లిలోని ఓం విహార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్యకు రెవెన్యూ డిపార్టుమెంటులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు ఐదుగురు కేటుగాళ్లు. ఆ కేటుగాళ్లు బాధితుడి స్నేహితులే కావటం ఇక్కడ అసలు ట్విస్ట్.

హైదరాబాద్ లోని వనస్థలిపురం కు చెందిన బూసి ప్రవీణ్ సాయి, శాలిబండకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ,ఈసీఐఎల్ కి చెందిన వంచ ప్రవీణ్ రెడ్డి, వేణు ,సంజీవ్ లు తమకు పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి బాధితుడి భార్యకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తామని నమ్మించి ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. దాన్ని గవర్నమెంట్ అపాయింట్మెంట్ లెటర్ గా చూపించి 8 లక్షలు వసూలు చేశారు.

Also Read :- నిమిషంలోనే చనిపోయిన కుర్రోడు

అది ఫేక్ అపాయింట్మెంట్ అని తెలుసుకున్న బాధితుడు బుధవారం ( అక్టోబర్ 2, 2024 ) మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర ఉన్న ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, గ్రీన్ పెన్, కలర్ ప్రింటర్ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ సీజ్ చేసి వారిని రిమాండ్ తరలించారు పోలీసులు.