హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో... నకిలీ మందుల దందా

  • అధికారుల తనిఖీల్లో బట్టబయలు
  • రూ.2.80 కోట్ల మందుల స్టాక్ సీజ్

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్‌‌‌‌లో నకిలీ మందుల దందా వెలుగులోకి వచ్చింది. గురువారం అగ్రికల్చర్‌‌‌‌ అధికారులు తనిఖీ చేసి రూ.2 కోట్ల విలువైన మందులను సీజ్ చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్‌‌‌‌ స్వర్ణ వివరాల ప్రకారం..  బెయర్, యూపీఎల్, ఎఫ్ఎంపీ, కొట్టావా అగ్రి సైన్స్, టీడీజీఎల్, సింజంట పెస్టిసైడ్ కంపెనీల పేరిట నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు గురువారం పట్టణంలోని లక్ష్మిసీడ్స్ షాపును తనిఖీ చేసేందుకు వెళ్లారు.  కానీ, షాపు యజమాని పమ్మి వెంకటసీతారెడ్డి  షాపు మూసివేసి వెళ్లిపోయాడు. 

దీంతో సాయిబాబా థియేటర్‌‌‌‌లో అనధికారికంగా  నిర్వహిస్తున్న గోదాములను తనిఖీ చేశారు. ఇక్కడ బిల్లులు లేని సుమారు రూ 80 లక్షల విలువైన పలు కంపెనీల  మందులు లభ్యం కావడంతో సీజ్ చేశారు.  అనంతరం తహసీల్దార్ నాగార్జునరెడ్డి పర్యవేక్షణలో మరో గోదామ్‌‌ను తెరిపించి.. అందులో ఉన్న రూ .2 కోట్ల విలువైన మందుల స్టాక్‌‌ సీజ్ చేశారు. వీటిని ల్యాబ్‌‌కు పంపిస్తామని, రిజల్ట్‌‌ ఆధారంగా డీఏవో రామారావు నాయక్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ఆఫీసర్‌‌‌‌ స్వర్ణ తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఈవో దొంతగాని నరేశ్ గౌడ్, రెవెన్యూ అధికారులు షరీఫ్ , శ్రీనివాస రావు  పాల్గొన్నారు .అక్రమ వ్యాపారం బయటపడిందిలా ఆయా కంపెనీల మందులు పనిచేయడంలేదని, పనిచేసిన చోట పంట పాడవుతోందని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మందుల డబ్బాల బ్యాచ్ నెంబర్‌‌‌‌ ఆధారంగా షాపులపై నిఘా పెట్టారు. గురువారం సమయం చూసుకొని దాడులు చేయడంతో నకిలీ దందా వెలుగులోకి వచ్చింది.