ఫోన్ పే ద్వారా నగదు తీసుకుంటున్నారా..ఐతే బీ కేర్‌ఫుల్. మీ ఫోన్‌కు నగదు వచ్చినట్లు అవతలి వ్యక్తి ఫోన్‌లో చూపిస్తుంది. కానీ అది మీ ఖాతాలో జమ అవదు. అదేంటి అనకుంటున్నారా. అది ఫోన్ పే యాపే కానీ ఉత్తుత్తి ఫోన్ పే. ఈ నకిలీ ఫోన్ పే యాప్‌ను అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. సరిగ్గా ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ వ్యక్తి జిరాక్స్ షాపునకు వెళ్లి ... తన దగ్గర లిక్విడ్ నగదు లేదని.. ఫోన్ పే చేస్తానని చెప్పగా .. ఇస్తానని చెప్పి ఫోన్ పే చేయమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ( రాజ్ కుమార్ ) నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదును చెల్లించాడు. డబ్బులు చెల్లించినట్లు అతడి ఫోన్‌లో కనపించింది. కానీ షాఫు ఓనర్ ఖాతాలోకి రాలేదు. అనుమానం వచ్చిన ఓనర్ ఆ వ్యక్తి నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా నగదు చెల్లించినట్లు ఓనర్ గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చిన షాపు ఓనర్ ఆవ్యక్తిని అక్కడే ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నకిలీ ఫోన్ ఫె ఆఫ్ తో చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారస్తులు సైతం మోసపోతున్నారు. పోలీసులు ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసగాళ్లు తమ తెలివితేటలతో చాకచక్యంగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నకిలీ ఫోన్ పే ఆప్ తో మోసం చేస్తున్న బండారి రాజ్ కుమార్ అనే వ్యక్తి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు.
కొంతమంది కేటుగాళ్లు పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో కొంత మంది కేటుగాళ్లు ఇలాంటి యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు పోలీసులు. సో…ఇలాంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు