- గలీజ్ దందా చేస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ టాస్క్‌ఫోర్స్
హనుమకొండ, వెలుగు: కల్తీ ప్రొడక్ట్స్తయారు చేసి వివిధ కంపెనీల స్టిక్కర్లతో దందా చేస్తున్న ఓ గ్యాంగ్‌ను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.5 లక్షల విలువ చేసే కల్తీ బూస్ట్, సర్ఫ్ప్యాకెట్లు, ఆలౌట్ రీఫిల్లర్స్, ప్లాస్టిక్జగ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను వరంగల్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ బుధవారం తెలియజేశారు. హైదరాబాద్‌కు చెందిన అవినాశ్కటారియా, హీరాలాల్ బిష్ణోయ్, గేవార్ రామ్, మెహర్ రామ్‌పటేల్‌తో కలిసి హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన వజ్రపు నర్సింహమూర్తి, వరంగల్ గోపాలస్వామి ఏరియాకు చెందిన యనగంటి రాకేశ్ కొంతకాలంగాకల్తీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. పిల్లలు తాగే బూస్ట్‌తో పాటు బట్టలుతకడానికి వాడే సర్ఫ్ఎక్సెల్, దోమలను చంపే గుడ్నైట్మస్కిటో రీఫిల్లర్స్కు డూప్లికేట్తయారు చేసి దందా చేస్తున్నారు. ఏడాది నుంచి ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. డీసీపీ వైభవ్ సూచనల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ సీహెచ్.శ్రీనివాస్‌జీ, ఎస్సై ప్రేమానందం నిఘా పెట్టారు. బుధవారం పెద్ద సంఖ్యలో నకిలీ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించి అవినాశ్ కటారియాతో పాటు వజ్రపు నర్సింహమూర్తి, యనగంటి రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హీరాలాల్ బిష్ణోయ్, గేవార్ రామ్, మెహర్ రామ్ తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.56లక్షల విలువైన 153 కల్తీ బూస్ట్ జార్స్, 480 ఆలౌట్ లిక్విడ్స్, 836 గుడ్‌నైట్ లిక్విడ్స్, 151 సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు, 16 ప్లాస్టిక్ గ్లాసులు, ఒక మారుతీ వ్యాన్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.