ప్రస్తుత మార్కెట్లో డిజిటల్ పేమెంట్లు కీలకంగా మారాయి..QR కోడ్‌లు చెల్లింపులు బాగా పెరిగాయి. ఏదీ కొన్నా కోడ్ స్కాన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులనుంచి లగ్జరీ మాల్స్ వరకు చెల్లింపులకు ప్రతి చోటా క్యూఆర్ కోడ్ వినియోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ ల వినియోగం పెరుగుతుండటంతో కస్టమర్లను మోసం చేసేందుకు స్కామర్లు QR కోడ్ లను ఎంచుకుంటున్నారు.
QR కోడ్ మోసం ..
ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఒక కేసు బయటపడింది. ఇది QR కోడ్‌లతో కస్టమర్‌లను దోపిడీ చేయడానికి స్కామర్‌ల కొత్త వ్యూహాన్ని హైలైట్ చేసింది. మోసగాళ్లు దుకాణాలు , పెట్రోల్ పంపుల వద్ద చట్టబద్ధమైన క్యూఆర్ కోడ్‌లకు బదులుగా నకిలీ క్యూఆర్ కోడ్ లను వినియోగిస్తున్నారు. కస్టమర్లు ఈ నకిలీ కోడ్‌లను స్కాన్ చేసినప్పుడు వారి డబ్బు స్కామర్‌ల ఖాతాలకు వెళుతుంది. అంతేకాదు మీ విలువైన సమాచారాన్ని దొంగిలించవచ్చు.
నకిలీ QR కోడ్‌లను ఎలా గుర్తించాలి?
నకిలీ QR కోడ్‌లను గుర్తించేదుకు ఒక మార్గం.. సౌండ్ బాక్స్..డబ్బు క్రెడిట్ అయితే సౌండ్ బాక్స్ వెంటనే నిర్ధారిస్తుంది. కాబట్టి QR కోడ్ చట్టబద్ధమైనదని చెప్పొచ్చు.
నకిలీ QR కోడ్‌లను గుర్తించేదుకు మరో మార్గం.. అందులో ఉంటే పేరును గుర్తించడం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అందులో ఉండే పేరును చెక్ చేయాలి. క్రాస్ వెరిఫై చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. పేమెంట్ వచ్చిందా లేదాని షాపు యజమానిని అడిగి తెలుసుకోవాలి.
నకిలీ QR కోడ్‌లను గుర్తించేదుకు ముఖ్యమైన మార్గం.. Google లెన్స్‌తో QR కోడ్‌లను స్కాన్ చేయడం. మీకు QR కోడ్ గురించి ఖచ్చితంగా తెలియకుంటే మీరు ఫోన్‌లో యాక్సెస్ ఉన్న Google లెన్స్ లేదా అలాంటి యాప్‌లను ఉపయోగించి దాన్ని స్కాన్ చేయాలి. ఇది కోడ్ ఫేక్ అయితే గుర్తిస్తుంది. అనుమానాస్పద లింక్‌లను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.
QR కోడ్ స్కామ్‌ల నుంచి సేఫ్ గా ఉండాలంటే..
- ధృవీకరించని లేదా అనుమానాస్పద QR కోడ్‌లను స్కాన్ చేయకూడదు.
- అనధికార లావాదేవీల కోసం మీ బ్యాంక్ ఖాతాను ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
- మోసాలను గుర్తించే ఫీచర్లతో ఉన్న యాప్ లను వినియోగించండి.
- QR కోడ్ లను గుర్తిస్తే స్థానిక అధికారులు లేదా బ్యాంకులకు తెలియజేయాలి.