ఫేక్ రిపోర్ట్ : చేతగాని సైన్యాలు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న తప్పుడు ప్రచారం

కొన్నిరోజులుగా మన వెలుగుదినపత్రిక లోగోను వాడుకుంటూ రకరకాల తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓటర్లను తప్పుదోవ పట్టించేలా వెలుగుసర్వే పేరుతో ఫేక్ పోస్టులను పెయిడ్ సైన్యాలు ప్రచారంలో పెట్టాయి. ఓటర్లను నమ్మించడానికి వెలుగుపేరును వాడుకోవడాన్ని బట్టే ఫలితం వారికి అనుకూలంగా లేదన్నది అర్థమవుతోంది. చేతగాని సైన్యాలు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న ఇలాంటి ప్రచారాలను పాఠకులు, ప్రేక్షకులు ఏ మాత్రం నమ్మవద్దని కోరుతున్నాం. వెలుగుఎలాంటి సర్వేలను చేయలేదు. తప్పుడు పోస్టులపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే పరిస్థితిలో ఆ శాఖ లేదు. అందుకే నేరుగా పాఠకులనే అలర్ట్ చేయాలని భావిస్తున్నాం. చదువుకున్న ఓటర్లుగా తప్పుడు పోస్టులను నమ్మకుండా, విచక్షణతో ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాం.