నల్గొండలో ఫేక్ రిపోర్టర్ల గుట్టురట్టు.. బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు వసూలు చేస్తున్న వైనం..

నల్గొండలో ఫేక్ రిపోర్టర్ల గుట్టురట్టు.. బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు వసూలు చేస్తున్న వైనం..

నల్లగొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టయ్యింది.. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ పత్రిక ముసుగులో అక్రమ వసుళ్ళకు పాల్పడుతున్న నకిలీ రిపోర్టర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు లేకుండా ప్రభుత్వం, పోలీసుల, ప్రజాప్రతినిధుల పై అడ్డగోలు రాతలతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారు ఫేక్ రిపోర్టర్లు. బ్లాక్ మెయిల్ బాధితులు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

బ్లాక్ మెయిల్ చేసిన వీడియోస్, ఆడియోస్ తో ఎస్పీకి మొరపెట్టుకున్నారు బాధితులు.లక్షల్లో ఇస్తే వార్తలు రాయటం ఆపేస్తామని 
.. లేదంటే ఇబ్బందులు తప్పవంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్న ఆడియో వైరల్ గా మారింది. డిజిటల్ పేపర్ ముసుగులో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న ఫేక్ రిపోర్టర్లకు రూ.1లక్ష 10వేలు సంపర్పించుకున్నాడు మిర్యాలగూడ డివిజన్ లో ఓ సీఐ.. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండటంతో ... పరువు పోతుందని భావించిన సీఐ కుటుంబం జిల్లా ఎస్పీని కలిసి విషయం చెప్పగా.. స్పెషల్ టీంతో విచారణ చేపట్టారు. 

ఇంకా చాలామంది పోలీస్ అధికారులు, అధికారులు,ప్రజాప్రతినిధులు టార్గెట్ గా బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.. 
బాధితుల పిర్యాదు మేరకు బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డ ఫేక్ రిపోర్టర్లపై కేసు నమోదు చేశారు మిర్యాలగూడ రూరల్ పోలీసులు. ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నామని.. బ్లాక్మెయిల్ చేసిన వారిపై పై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు.