మునుగోడు బై పోల్పై ‘v6 వెలుగు’ సర్వే చేసిందంటూ సోషల్ మీడియాలో కొంతమంది వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. అక్రమంగా ‘v6 వెలుగు’ లోగోను వినియోగించి.. దానితో కూడిన సర్వే రిపోర్టులను కొందరు సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ ఫేక్ సర్వే నివేదికను ‘v6 వెలుగు’ నెట్ వర్క్ నిర్వహించిందని ప్రజలను నమ్మించేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిసింది.
వాస్తవానికి ‘v6 వెలుగు’ ఎన్నడూ ఎన్నికల సర్వేలను నిర్వహించలేదు. ‘v6 వెలుగు’ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సర్వే నివేదికలను ప్రజలు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఫేక్ సర్వే రిపోర్టులు. వాటితో ‘v6 వెలుగు’కు ఎటువంటి సంబంధం లేదు. గతంలోనూ ఇదే తరహాలో ‘v6 వెలుగు’ పేరిట ఫేక్ సర్వే రిపోర్టులను పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.