ఇది తప్పుడు వార్త.. V6 కి ఈ వార్తకి ఎలాంటి సంబంధం లేదు

  • కొన్ని సోషల్‌‌‌‌ మీడియా గ్రూపుల్లో తప్పుడు ప్రచారం
  • గ్రేటర్‌ ఎలక్షన్‌ను ప్రభావితం చేసేందుకు కొందరి ప్లాన్‌

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైద రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబం ధించి V6-వెలుగు సర్వే చేసినట్లు కొందరు తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్‌‌ This image has an empty alt attribute; its file name is Fake-Survey-on-GHMC-Elections-2020.jpegచేస్తున్నారు. V6 వెలుగు లోగోలతో క్రియేట్‌‌ చేసిన ఫేక్‌‌ న్యూస్‌‌ల ద్వారా టీఆర్‌‌ఎస్‌‌కు ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని సర్వేలో తేలినట్లు చూపిస్తూ సోషల్‌ మీడియా గ్రూపు ల్లో షేర్‌ చేస్తున్నరు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసి లాభం పొందా లనే దురుద్దేశంతో కొందరు పని గట్టుకొని V6 వెలుగు మీడియా సంస్థల పేరుతో ప్రచారం చేస్తున్నారు. తమ సంస్థ లోగోలతో తప్పుడు పోస్టులు, స్ర్కీన్ షాట్లను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రేటర్ ఎలక్షన్స్‌‌కు సంబంధించి వీ6 వెలుగు ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది. సర్వే చేస్తే V6 టీవీ, వెలుగు పత్రికతో పాటు V6 సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ల  ద్వారా బాహాటంగా వెల్లడిస్తామని చెప్పింది.