షాద్ నగర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఘటన కొందుర్గ్ మండలంలోని చిన్న ఎల్కిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది.. కొందుర్గ్ పోలీసుల వివరాల ప్రకారం చిన్న ఎల్కిచర్ల గ్రామంలో సిబ్బంది పెట్రోలింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎల్కిచర్ల శివారులో ఓ డీసీఎంను ఆపి తనిఖీ చేశారు. దాంట్లో 50 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు గుర్తించారు. డీసీఎం డ్రైవర్ సురేందర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఘట్కేసర్లో
ఘట్కేసర్ : ఘట్ కేసర్ సీఐ పరుశురాం వివరాల ప్రకారం... యాదాద్రి -భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జంగయ్యతండాకు చెందిన భూక్య రాజేందర్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. మంగళవారం ఘట్కేసర్కు చెందిన సయ్యద్ అబ్దుల్ అజీజ్ రేషన్ బియ్యం కొనుగోలు చేయడానికి రాజేందర్‌కు సహకరిస్తూ టాటా ఏస్ లో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసి, రాజేందర్, అబ్దుల్ అజీజ్‌పై కేసు నమోదు చేశారు.