ఫేక్ వీడియో: కేసీఆర్ మీటింగ్‌కు వస్తే రూ. 500 ఇస్తామంటూ డప్పు చాటింపు

బుధవారం హాలియాలో జరిగే సీఎం కేసీఆర్ మీటింగ్‌కు హాజరైతే రూ. 500 కూలీ ఇస్తామంటూ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మట్టంపల్లి మండలం గుర్రంపోడు తండ గ్రామ సర్పంచి పార్వతీరామారావు ఈ చాటింపు వేయిస్తున్నట్లుగా వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సర్పంచ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు అనగా ఫిబ్రవరి 10న హాలియాలో జరిగే ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ మీటింగ్ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సుమారు 500 మందితో సభకు రావాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు వీడియోను మార్ఫింగ్ చేసి సీఎం కే‌సి‌ఆర్ మీటింగ్‌కు వస్తే రూ. 500 కూలీ ఇస్తామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనికి బాద్యులైన కారకులపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For More News..

భారత్ ప్రపంచశక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నాం

వేడి నూనె పోసి.. కారం చల్లి భర్తపై దాడి

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు