Delhi Polls: రిగ్గింగ్ జరుగుతుందంటూ ఢిల్లీలో ఆందోళనలు

Delhi Polls: రిగ్గింగ్ జరుగుతుందంటూ ఢిల్లీలో ఆందోళనలు

దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ సందర్భంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గందరగోళం నెల కొంది.భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతలు ఆరోపించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.  సీలంపూర్, జంగ్ పురాలో, చిరాగ్ ఢిల్లీలో  పలు పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. 

సీలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బురఖా ధరించిన కొంతమంది మహిళలు దొంగ ఓట్లు వేశారని బీజేపీ నేతలు ఆరోపించడంతో బీజేపీ , ఆప్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది..  రెండు వర్గాలు ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.. అయితే ఎవరికి గాయాలు కాలేదు. 

Also Read : ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్

మరోవైపు  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సెగ్మెంట్ జంగ్ పురా లో ఓటర్లకు డబ్బులు పంచారని ఆప్ పార్టీ ఆరోపించింది. అలాంటిదేం జరగలేదన పోలీసులు ఆప్ పార్టీ నేతలకు వివరణ ఇచ్చారు. 

చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఓటర్లను ఆపడానికి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. భరద్వాజ్ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు.

బుర్ఖా ధరించిన కొంతమంది మహిళలు నకిలీ ఓట్లు వేశారని బిజెపి ఆరోపించింది. ఆరోపణల తర్వాత, బిజెపి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ముఖా ముఖిగా తలపడ్డారు. రెండు వర్గాలు నినాదాలు చేశాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరిగినట్లు సమాచారం. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు.

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న పోలిం గ్ లో  బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం తెలిపిం ది. ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.