
కూకట్పల్లి, వెలుగు: బాలానగర్ఇండస్ట్రియల్ఏరియాలో బ్రాండెడ్ వాటర్ కంపెనీల లేబుళ్లతో నకిలీ వాటర్‌బాటిళ్లు తయారుచేస్తున్న ప్లాంట్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం రాత్రి అక్కడి బాలాజీ వాటర్ ప్లాంట్‌లో తనిఖీలు నిర్వహించారు. నకిలీ వాటర్ బాటిళ్లపై బ్రాండెడ్లేబుళ్లు వేసిన వంద కార్టన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని బాలానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది.