
శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది కేటుగాళ్లు.. వసతి.. రూమ్స్ పేరుతో నకిలి వెబ్ సైట్స్ సృష్టించి భక్తులను దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...
నంద్యాల జిల్లా శ్రీశైలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులను సైబర్ క్రిమినల్స్ దోచుకుంటున్నారు. శ్రీశైలంలో నకిలి వెబ్‌సైట్స్ సృష్టించి.. వసతి సదుపాయం కలుగజేస్తామని భక్తులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వెబ్సైట్లను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Also Read :- తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసం
శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి ఏర్పాట్లు చేసుకోవడానికి ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, తాజాగా భక్తులను టార్గెట్ చేస్తూ కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్ ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
సైబర్ కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో అసలు అధికారిక వెబ్‌సైట్‌కు దగ్గరగా ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌ను తయారు చేశారు. భక్తులు దానిని అసలైనదిగా భావించి వసతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా, డబ్బులు కూడా చెల్లించారు. శ్రీశైలానికి వచ్చిన తర్వాత తాము మోసపోయామని గ్రహించిన భక్తులు ఆలయ అధికారులను సంప్రదించారు.
భక్తులకు హెచ్చరిక – అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించండి
ఇలాంటి మోసాలను నివారించడానికి భక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ (www.srisailadevasthanam.org) ద్వారానే సేవలు పొందాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్‌సైట్‌లను ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు.
భక్తుల కోసం కొన్ని జాగ్రత్తలు
- అధికారిక వెబ్‌సైట్‌ను తప్పనిసరిగా చెక్ చేయండి
- అనుమానాస్పద వెబ్‌సైట్‌లకు బ్యాంక్ డిటెయిల్స్ ఇవ్వొద్దు
- ఇలాంటి మోసాల గురించి ఇతర భక్తులకు అవగాహన కల్పించండి
- ప్రశ్నించదగిన లింకులు, ఫోన్ నంబర్లను ఉపయోగించకుండా ఉండండి