కామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్ కలకలం

కామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్ కలకలం

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా కలెక్టర్ పేరుతో కొందరు గుర్తుతెలియని దుండగులు సైబర్ మోసానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ ఉద్యోగులకు డబ్బులు పంపాలని మెస్సేజ్ లు వెళ్లడం జిల్లాలో కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పేరిట ఓ నకిలీ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేశారు. 

కలెక్టర్ ఫొటోతో డీపీ పెట్టి ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు. డబ్బులు పంపాలని కలెక్టరేట్‌లో పని చేసే  ఏటివోఓకు మెసేజ్ చేశారు మోసాగళ్లు. వెంటనే కలెక్టరేట్ సిబ్బంది అప్రమత్తమై.. ఈ విషాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏవో సయ్యద్ అహ్మద్ మస్రాద్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.