ఏం ఐడియా : పెళ్లి సంబంధంతో బయటపడిన నకిలీ మహిళా పోలీస్ SI బాగోతం

ఏం ఐడియా : పెళ్లి సంబంధంతో బయటపడిన నకిలీ మహిళా పోలీస్ SI బాగోతం

ఉద్యోగం రాలేదని ఏకంగా నకిలీ ఎస్సై అవతారం ఎత్తింది ఓ యువతి.. ఏకంగా ఏడాదిగా ఆర్పీఎఫ్ ఎస్సై అని చెబుతూ అందరిని మోసం చేస్తుంది. చివరికి  పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికి పోయింది.  ఈ  ఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో జరిగింది. 

అసలేం జరిగిందంటే.. నార్కట్ పల్లి కి చెందిన  మాళవిక  అనే యువతి నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది  .2018 లో అర్పీఎఫ్   ఎస్సై పరీక్ష రాసింది. కంటి సమస్య(మెల్ల కన్ను) ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు. గత ఏడాదిగా నార్కట్ పల్లి గ్రామంలో ఆర్పీఎఫ్ ఎస్సైగా చెలామణి అవుతోంది మాళవిక. శంకర్ పల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు అందరిని నమ్మించింది .  

ALSO READ :- Healthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!

అర్పీఎఫ్  ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐడి కార్డులు తయారు చేసుకుంది. ఇటీవల పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది మాళవిక. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు  పై అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. దీంతో  నల్గొండలో మాళవికను పట్టుకున్నారు రైల్వే పోలీసులు. తల్లి తండ్రుల భాద పడుతుండటంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపారు రైల్వే ఎస్పీ. మాళవిక ఇన్ స్టాగ్రామ్ లో ఆర్పీఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేసినట్లు తెలిపారు పోలీసులు.