గుండె ఆపరేషన్లు చేసిన ఫేక్ డాక్టర్..వారం రోజుల్లో ఏడుగురిని చంపిండు

గుండె ఆపరేషన్లు చేసిన ఫేక్ డాక్టర్..వారం రోజుల్లో  ఏడుగురిని చంపిండు


నకిలీ డాక్టర్లు ఈ మధ్య ఎక్కువవుతున్నారు. ఆస్పత్రులు పెట్టి ఆపరేషన్లు చేస్తూ  రోగుల ప్రాణాల తీస్తున్నారు. లేటెస్ట్ గా ఉత్తరప్రదేశ్ లో ఓ కేటుగాడు కార్డియాలజిస్ట్    అవతారం ఎత్తి  ఏకంగా పలువురికి గుండె ఆపరేషన్లు చేశాడు. ఇతగాడు ఆపరేషన్లు చేసిన వాళ్లలో వారం రోజుల్లోనే  ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో  అసలు భాగోతం బయటపడింది. 

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో బ్రిటిష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్  కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటూ ట్రీట్ మెంట్ చేస్తున్నాడు. రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నాడు. అతని దగ్గర గుండె ఆపరేషన్ చేసుకున్న ఏడుగురు వారం రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారని ఫిర్యాదులు వచ్చాయి. 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతను అసలు డాక్టర్ కాదనే విషయాన్ని గుర్తించారు. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని పోలీసులు చెప్పారు. అతను బ్రిటిష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్  పేరుతో కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటూ క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడని తెలిపారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రియాంక కనూంగో తెలిపిన వివరా ప్రకారం.. నిందితుడు  నరేంద్ర యాదవ్ ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో చేసిన ఆపరేషన్లకు  ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి  డబ్బులు తీసుకున్నట్లు గుర్తించాం. నిందితుడు బ్రిటీష్ డాక్టర్  ఎన్ జాన్ కెమ్  పేరుతో ఫేక్ డాక్యుమెంట్లతో డాక్టర్ గా ట్రీట్ మెంట్ చేస్తున్నాడు.  యాదవ్ పై హైదరాబాద్‌లోనూ పలు  కేసులు నమోదయ్యాయి. .మృతులు ఏడుగురి చెబుతున్నప్పటికీ ఈ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు.  ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది అని ప్రియాంక కనూంగో తెలిపారు.