ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో బాబర్ అజామ్ టాప్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ అతడికి పాక్ క్రికెట్ బోర్డు వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది. అయితే బాబర్ మాత్రం రెగ్యులర్ గా విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు. దీంతో అతడిపై పాక్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా టెస్ట్ స్క్వాడ్ నుంచి అతడిని తప్పించింది. ఇంగ్లాండ్ తో జరగబోయే రెండు, మూడు టెస్టులకు బాబర్ అజామ్ పేరు లేకపోవడం సంచలనంగా మారింది.
బాబర్ ను ఎంపిక చేయకపోవడంతో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. అతడిని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తారని బాబర్ కు మద్దతుగా నిలిచాడు. "బాబర్ అజామ్‌ను జట్టులో చోటు దక్కపోవడం ఆందోళన కలిగిస్తుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ లో ఉన్నప్పటికీ భారత్ అతడిని తుది జట్టులో ఆడించింది. కోహ్లీ మూడు ఫార్మాట్ లలో వరుసగా 19.33, 28.21, 26.50 యావరేజ్ తో పరుగులు చేశాడు". అని ఫఖర్ జమాన్ ట్వీట్ చేశాడు.
బాబర్ రెండేళ్లుగా ఘోరంగా విఫలమవుతున్నారు. అతడి చివరి 17 టెస్ట్ ఇన్నింగ్స్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ 30 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పైనా బాబర్ పరుగులు చేయడానికి తంటాలు పడుతున్నాడు. బాబర్ తో పాటు షహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్‌లకు సైతం చోటు దక్కలేదు.
Fakhar Zaman is unhappy with how Pakistan's selectors have handled Babar Azam 👀 pic.twitter.com/iSI2ARokwr
— Sport360° (@Sport360) October 13, 2024