ఇంగ్లాండ్ తో జరగబోయే రెండు, మూడు టెస్టులకు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పేరు లేకపోవడం సంచలనంగా మారింది. బాబర్ ను ఎంపిక చేయకపోవడంతో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. అతడిని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తారని బాబర్ కు మద్దతుగా నిలిచాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ బాబర్ ను వెనకేసుకొచ్చాడు. దీంతో ఫఖర్ జమాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్ ఇలా సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టడం నిబంధనల్ని ఉల్లఘించడమే అని పాక్ క్రికెట్ బోర్డు అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధానాలు, ఎంపికను విమర్శించడం ద్వారా ఫఖర్ జమాన్ క్రమశిక్షణ ఉల్లఘించాడని నోటీసుల్లో పీసీబీ పేర్కొంది. ఏడు రోజుల్లోగా.. అంటే అక్టోబర్ 21లోగా ఆ నోటీసులకి సమాధానం ఇవ్వాలని ఫకార్‌ను పీసీబీ ఆదేశించింది.
ALSO READ | IND vs NZ 2024: బెంగళూరులో మ్యాచ్..న్యూజిలాండ్ క్రికెటర్‌కు సొంతగడ్డ
ఈ నోటీసుల వ్యవహారం ఫఖర్ జమాన్, పీసీబీ మధ్య విభేదాలను మరింత పెంచే అవకాశం ఉంది. సెప్టెంబరులో కూడా ఒకసారి పీసీబీ డైరెక్టర్ తనపై వ్యవహరించిన తీరుపై ఫకార్ జమాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 లీగ్ కోసం ఆటగాళ్లకు ఎన్‌వోసీలు ఇవ్వడంలో పీసీబీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ ఉస్మాన్ వాహ్లా జాప్యం చేశారని ఫఖర్ మండిపడ్డాడు.
ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకి పాక్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, ఆఘా సల్మాన్, జాహిద్ మహమూద్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహమ్మద్ హురైరా
Fakhar Zaman! pic.twitter.com/0Od87i9X8p
— RVCJ Media (@RVCJ_FB) October 14, 2024