Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్

Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్

క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్‌ విధానంలో జరగబోయే ఈ మెగా లీగ్ కు భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా పాకిస్థాన్ బరిలోకి దిగుతుంది.

2017 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై పాకిస్థాన్ భారీ విజయం సాధించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ ఫైనల్లో ఫకర్ జమాన్ అద్భుతమైన సెంచరీతో మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. 106 బంతుల్లో 12 ఫోర్లు.. 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడాడు. మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని ఈ పాక్ ఓపెనర్ ఆరాటపడుతున్నాడు. సొంతగడ్డపై టోర్నీ జరగనుండడం ఫకర్ కు కలిసి వచ్చే అవకాశం. యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో ఫకర్ జమాన్ ఎంపికవ్వడం దాదాపుగా ఖరారైంది. 

ALSO READ | Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ

ఈ మెగా టోర్నీకి నెల రోజుల సమయం ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శనపై ఈ పాక్ ఓపెనర్ మాట్లాడాడు. టీంఇండియాలో మ్యాచ్ విన్నర్లు ఎవరో చెప్పుకొచ్చాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగలరని ఫకర్ జమాన్ అభిప్రాయపడ్డాడు. 2017  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తన ప్రదర్శన మర్చిపోలేని జ్ఞాపకమని.. అలాంటి క్షణాలు ఎప్పటికీ ,మరిచిపోలేమని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని జట్ల స్క్వాడ్ లను ప్రకటించగా పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.