
కరాచీ: ఇండియాతో కీలకమైన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఓపెనర్ ఫకర్ జమాన్ టోర్నీకి దూరమయ్యాడు. అతని ప్లేస్‌లో ఇమామ్ ఉల్ హక్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మార్పుకు ఐసీసీ ఆమోదం తెలిపిందని పీసీబీ గురువారం వెల్లడించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే క్రమంలో ఫకర్‌కు గాయమైంది.
దీంతో మ్యాచ్‌లో ఎక్కువ భాగం అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. అలాగే ఓపెనర్‌గా కాకుండా నాలుగో ప్లేస్‌లో బ్యాటింగ్ చేశాడు. ‘దురదృష్టవశాత్తు నేను చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇదంత దేవుడి ప్లాన్. గొప్ప అవకాశం చేజారింది. ఏదేమైనా మా జట్టుకు నా మద్దతు ఉంటుంది’ అని ఫకర్ పేర్కొన్నాడు.