హౌరా సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్కు 2013 అక్టోబర్ 16వ తేదీన పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద రైలు బోగీలకు, ఇంజిన్కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.
2015 సెప్టెంబరు 22 లోనూ హౌరా సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్కు పెద్ద ముప్పు తప్పింది. హౌరా రైల్వే స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుర్తు తెలియని దుండగులు బాంబు పెట్టారు. అయితే అధికారులు సరైన సమయంలో బాంబును గుర్తించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఆ రైలులోని బోగిలో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనపడింది. విషయం గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అది సిలిండర్ కాదు బాంబు అని గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబును నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి నిర్వీర్యం చేసింది. పెద్ద ప్రమాదం తప్పడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
2022 మార్చి 26న కూడా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. బోగీల నుంచి విడిపోయి కిలో మీటర్ ముందుకు వెళ్లింది ఇంజిన్. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మళ్లీ బోగీలను అటాచ్ చేశారు. దాంతో తిరిగి ట్రైన్ బయలు దేరింది.
ALSO READ :ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదం.. స్తంభించిన రైళ్ల రాకపోకలు
2023 జులై7వ తేదీన గురువారం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10.20 నిమిషాలకు సికింద్రాబాద్ వైపు వస్తున్న సమయంలో ఒక్క సారిగా ఎస్ 4 లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో రైలులోని ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 కోచ్లకు మంటలు వ్యాపించాయి. ఎస్ 4లో ఒక వ్యక్తి కోచ్ లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వద్ద సిగరెట్ తాగడంతోనే ఆ నిప్పులు పక్కనే ఛార్జింగ్ బోర్డు పైన పడి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయని ప్రయాణీకులు చెప్పారు. అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణీకులు రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.