హౌరా – సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌రైలులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు కాలి బూడిదయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపిస్తుండటంతో అధికారులు ట్రైన్ లింక్ తొలగించారు. ప్రయాణికులు అప్రమత్తం అయి చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ :Falaknuma express: అంతా క్షణాల్లోనే.. పొగలు రావటం.. చెయిన్ లాగటం.. దూకేయటం..
ట్రాక్ పై రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని సమయాల్లో మార్పులపై స్థానిక రైల్వే అధికారులకు సంప్రదించాలని సూచిస్తున్నారు.