Falaknuma express :మంటల్లో మూడు బోగీలు..భయానక వాతావరణం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి సికింద్రాబాద్ రైల్లో  కేవలం 30 నిమిషాల ప్రయాణం. రాత్రంతా ప్రయాణంతో అలిసిపోయిన ప్రయాణికులు..గమ్యస్థానానికి మరో అరగంటలో చేరుకుంటామని సంబరపడుతున్నారు. ఇంకో 30 నిమిషాల్లో సికింద్రాబాద్ కు చేరుకుంటాం. ఇంకేంటి హ్యాపీగా ఇంటికెళ్లిపోవచ్చు అనుకున్నారు. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం. చిన్న షార్ట్ సర్క్యూట్.. పెద్ద ప్రమాదాన్ని  సృష్టించింది. ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్  యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లికి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చిన్నగా రేగిన మంటలు చూస్తుండగానే వ్యాపించాయి. దట్టమైన పొగలతో పగిడిపల్లి ప్రాంతం అంతా భయానక వాతావరణ నెలకొంది. ముందుగా ఎస్ 4 బోగీలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ మంటలు ఎస్ 5కు వ్యాపించాయి. అనంతరం పక్కనే ఉన్న  ఎస్ 5కి అంటుకున్నాయి. 

భారీగా మంటలు..దట్టమైన పొగలు..

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఎస్ 4, ఎస్5, ఎస్ 6 బోగీలు షార్ట్ సర్య్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకున్నాయి. మంటల ధాటికి ఇనుప చువ్వలు కాలిబూడిదయ్యాయి. ఒక సీటు..రెండో సీటు..మూడో సీటు అలా అలా కాలుకుంటూ బోగీ మొత్తం వ్యాపించాయి. ఈ మంటలు ఎస్ 4 నుంచి ఎస్ 5కి వ్యాపించాయి. అది కూడా పూర్తిగా బూడిదైపోయింది. ఆ తర్వాత ఎస్6 బోగీకి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో మూడు బోగీలు మొత్తం కాలిపోయాయి.