ఏనుమాముల మార్కెట్లో తగ్గుతున్న పత్తి ధరలు

  • ఏనుమాముల మార్కెట్లో తగ్గుతున్న పత్తి ధరలు
  • క్వింటాల్​ కు గరిష్టంగా రూ.7 వేలు

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో పత్తి ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. బుధవారం ఏనుమాముల మార్కెట్​కు సుమారు  2200 పత్తిబస్తాలు రాగా క్వింటాల్ కు గరిష్టంగా రూ.7020,  కనిష్టంగా రూ.4600 ధర పలికింది. సీజన్ ​ప్రారంభంలోనే ధరలు తగ్గుతుండడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమను రాష్ట్ర  ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు పత్తి  రైతులు కోరుతున్నారు.