మూడు రోజుల నుంచి డౌన్‌ట్రెండ్
బుధవారం ఒక్కరోజే రూ.2 వేలు తగ్గిన ధర
సిల్వర్ కూడా దిగొస్తోంది
న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డులతో ఆకాశాన్ని తాకిన గోల్డ్ ధరలు వరుసగా మూడు రోజుల నుంచి నేల చూపులు చూస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 2 వేల రూపాయల మేర తగ్గింది. ఆల్ టైమ్ హై రూ.56,191 నుంచి గోల్డ్ ధరలు రూ.50 వేల మార్క్ దిగువకు పడిపోయాయి. మొత్తంగా రూ.6,236 తగ్గాయి. గోల్డ్ ధరలు చివరిసారి జూలై 21న రూ.50 వేల కంటే తక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో రేట్లు పడిపోవడంతో, దేశీయంగా కూడా గోల్డ్ ధరలు తగ్గుతున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. గోల్డ్ ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా నేల చూపులు చూస్తున్నాయి. కేజీ వెండి ధర ఒక్కరోజే రూ.6 వేల మేర తగ్గింది. దేశీయ మార్కెట్‌లో గత మూడు రోజుల నుంచి కేజీ వెండి ధర రూ.17,039 పడిపోయి రికార్డు మార్క్ రూ.77,949 నుంచి రూ .60,910కు దిగొచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో రూ.50 వేల మార్క్ కిందకు పడిపోయాయని కేడియా అడ్వయిజరీ అజయ్ కేడియా అన్నారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ ర్యాలీ చేయడం, ఈక్విటీలు ఆల్ టైమ్ క్లోజింగ్ హైలో ముగియడ తో గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతోందని పేర్కొన్నారు. అంతేకాక అమెరికాలో ఎకనమిక్ డేటా అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని అనలిస్ట్‌లు చెప్పారు. ఈక్విటీల్లో సెంటిమెంట్లు బలపడుతున్నాయి. డాలర్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో గోల్డ్ ధరలు పతన బాట పట్టాయని ఆనంద్ రఠిషేర్స్అండ్ స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్అనలిస్ట్జిగార్ త్రివేది అన్నారు. రష్యా కూడా కరోనా వ్యాక్సిన్‌ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
49 వేలకు దిగొస్తాయని అంచనా…
గత నాలుగు రోజుల నుంచి గోల్డ్ ధరలు 10.61శాతం కరెక్ట్ అయ్యాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర లైఫ్ టైమ్ హై మార్క్ రూ.56,191 నుంచి రూ.50 వేల మార్క్ కిందకు దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ధర 9.32 శాతం తగ్గింది. దీంతో అక్కడ కూడా 2075 డాలర్ మార్క్ నుంచి 1872 మార్క్‌కు పడిపోయాయి. గోల్డ్ ధరల్లో మరింత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని, రూ.49 వేల మార్క్‌కు పడిపోతాయని అంచనావేస్తున్నట్టు ఏంజిల్ బ్రోకింగ్ రీసెర్చ్ డీవీపీ అనుజ్ గుప్తా తెలిపారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా గోల్డ్ ధరలు 1850 డాలర్లకు పడిపోతాయన్నారు.