
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ ఫ్లోర్లీడర్తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖానాపూర్, తిమ్మాపూర్‌కు చెందిన వీడీసీ సభ్యులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము ఎవరినీ బెదిరించలేదని, తమ పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేస్తున్న ఫ్లోర్లీడర్సత్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు వీడీసీ సభ్యులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫిర్యాదు చేసినవారిలో తిమ్మాపూర్, ఖానాపూర్ వీడీసీల అధ్యక్షులు బీసీ రాజన్న, సతీశ్ రావు, సభ్యులు కె.నారాయణ, పుప్పల మురళి, నేత శ్యామ్, శ్రీనివాస్, నర్సయ్య, నాగరాజు, రాజేశ్వర్ తదితరులున్నారు.