- బీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
- మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్
బెల్లంపల్లి, వెలుగు : ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మండిపడ్డారు. బెల్లంపల్లి, నెన్నెలకు చెందిన బీఆర్ఎస్ నేతలు గోలి శివ, మోతె రవీందర్, శ్రీనివాస్ గౌడ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక పాలన సాగించడంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించారని చెప్పారు. ఓటమిని తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా వివేక్ వెంకటస్వామి, వినోద్లపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్కాదన్నారు. ఈ విషయంపై పోలీసులు స్పందించకపోతే సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వినోద్, వివేక్ పై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోబోమని యాదగిరి హెచ్చరించారు. సమావేశంలో మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్, జిల్లా, పట్టణ నాయకులు పీక లక్ష్మణ్, సబ్బని రాజనర్సు, చింతల రాజకుమార్, జుమ్మిడి వెంకటేశ్, నిచ్చకోల పుల్లయ్య పాల్గొన్నారు.