న్యూఢిల్లీ: ఉగ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారన్న ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. తప్పుడు కథనాలతో భారత్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విదేశాంగ శాఖ జైశంకర్ అన్నారు. రీసెర్చ్ & అనాలిసిస్ వింగ్ (RAW) ద్వారా భారత ప్రభుత్వం 2019 పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌లో దాదాపు 20 హత్యలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ శాఖ జైశంకర్ ఈ విధంగా స్పందించారు.
యూకే డైలీ న్యూస్ పేపర్ ది గార్డియన్ కథనాలను ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఇలాంటి తప్పుడు కథనాలతో భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు జైశంకర్. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం భారత ప్రభుత్వ విధానం కాదని జైశంకర్ అన్నారు.
గతంలోనూ అమెరికా, కెనడా ఇలాంటి ఆరోపణలు చేసినా భారత్ తిరస్కరించింది. ఖలిస్తానీ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో 2023 సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించారు. మరో ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను చంపేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని అమెరికా ఆరోపణలు చేసింది. అయితే వీటిని భారత్ తిరస్కరించింది.