చంద్రబాబు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తప్పుడు ప్రచారం : విజయశాంతి

హైదరాబాద్, వెలుగు:  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ప్రమేయం ఉందన్న ప్రచారాన్ని బీజేపీ లీడర్ విజయశాంతి ఖండించారు. కొంతమంది కావాలనే మీడియా వర్గాల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు. చంద్రబాబు అరెస్ట్ జరిగిన విధానాన్ని తమ పార్టీ ఎంపీ, పార్లమెంట్ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఖండించారని ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్నారు.

ALSO READ: కుర్చీలు విసురుకుని మరీ కొట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు 

అవసరమైతే జాతీయ పార్టీ, లేకుంటే తెలంగాణ పార్టీగా కేసీఆర్ చెప్పుకుంటారని, అలాంటి అవకాశవాద రాజకీయాలు బీజేపీ చేయదని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.