గచ్చిబౌలి, వెలుగు: ఎన్నికల సమయంలో జనాలు ఎలాంటి ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పని చేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో రాచకొండ సీపీ డీఎస్ చౌహన్, మేడ్చల్ కలెక్టర్అమోయ్కుమార్, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సమస్మాత్మక ప్రాంతాల్లో ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి ప్లానింగ్ రూపొందించాలన్నారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా టీమ్స్‌ను నియమించాలని ఆయన సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీలు, అడిషనల్ కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.