
వికారాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్ అనగా విటమిన్స్‌తో కూడిన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే తప్పుడు ప్రచారాలను చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. పూడూర్ మండలంలోని గొంగు పల్లి రేషన్ షాపును బుధవారం ఆయన పరిశీలించారు. సన్న బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.