రుణమాఫీపై తప్పుడు ప్రచారం.. లెక్కలతో అన్ని వివరాలు బయటపెడ్తం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రుణమాఫీపై తప్పుడు ప్రచారం.. లెక్కలతో అన్ని వివరాలు బయటపెడ్తం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  దీనిపై కావాలనే ప్రతిపక్ష బీఆర్ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్​అయ్యారు. తాము అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. 

ఇవాళ (మార్చి 15) అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి మట్లాడుతూ ఽప్రతీ గ్రామాల్లో జాబితా పెడతాం. గృహ జ్యోతి 115 నియోజక వర్గాల సమాచారం మా దగ్గర ఉంది. మేము చేసేది ప్రజల కోసమే.  మీలాంటి రాజకీయ పార్టీలకు కాదు. ముఖ్యంగా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ మేలు చేశాం. గృహ‌జ్యోతి  పథకం కింద రూ.కోట్లు చెల్లిస్తున్నం’ అని తెలిపారు. 

పల్లా వాస్తవాలు చెప్పు

బీఆర్ఎస్​ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. విద్యాశాఖపై సమీక్షించడానికి ముఖ్యమంత్రికి సమయంలేదని అనడం సరికాదన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఓయూకి తొలిసారి దళిత వీసీని నియమించినట్లు వివరించారు. ‘పల్లా విద్యాసంస్థలు నడుపుతారు. లెఫ్ట్ నుంచి వచ్చారు. వాస్తవాలు చెప్తారని అనుకున్నం. కానీ ఇంత బ్లైండ్ గా మాట్లాడతారేంటి? అని మండిపడ్డారు.