మామూనూర్ 4వ బెటాలియన్ కానిస్టేబుల్​ కుటుంబసభ్యుల ఆందోళన

 మామూనూర్ 4వ బెటాలియన్ కానిస్టేబుల్​ కుటుంబసభ్యుల ఆందోళన
  • సీఎంకు ఫ్యాక్స్​ ద్వారా వినతి

ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: మామునూర్  4 వ బెటాయన్  కానిస్టేబుళ్ల కుటుంబాలు మంగళవారం ఆకస్మికంగా ఆందోళనబాట పట్టాయి. కానిస్టేబుళ్లతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీసం సెలవులు ఇవ్వకుండా తమకు దూరం చేస్తున్నారని, వారి కుటుంబసభ్యులు కన్నీరుపెట్టారు. కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు రోడ్డెక్కడంతో వరంగల్  ఆర్టీవో చౌరస్తా నుంచి మామునూర్  బెటాలియన్  వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పోలీసులు భారీగా మోహరించడంతో గవిచర్ల క్రాస్ రోడ్డు దగ్గర కానిస్టేబుళ్ల కుటుంబాలు ధర్నా చేసి ఆ తర్వాత విరమించారు. కొత్త డీజీ వచ్చాక సెలవులు ఇవ్వవద్దని నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకోవాలని కోరుతూ ఫ్యాక్స్  ద్వారా వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత మామూనూర్  పోలీసు బెటాలియన్  కమాండెంట్  రాంప్రసాద్ ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.