డిచ్పల్లి : ప్రభుత్వం వన్ పోలీస్ వన్ రూల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్హైవే 44పై డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీసుల భార్యలు ధర్నాకు దిగారు. పోలీస్డ్యూటీలో తమ భర్తలను వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటక పోలీసు విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు.
ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ సంఘీభావం తెలిపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్జామ్అయింది. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోని, ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.