స్టాక్ ​మార్కెట్​లో కోటి నష్టం.. ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

స్టాక్ ​మార్కెట్​లో కోటి నష్టం.. ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
  • నలుగురి పరిస్థితి విషమం.. మంచిర్యాల జిల్లాలో ఘటన

శివప్రసాద్ స్టాక్ మార్కెట్​లో సుమారు కోటి రూపాయల వరకు నష్టపోయినట్లు సమాచారం. గ్రామంలో చాలా మంది వద్ద అప్పులు చేశాడు. డబ్బులు తిరిగివ్వాలని అప్పు ఇచ్చినోళ్లు ఒత్తిడి చేయడంతో కొన్ని నెలల కింద శివప్రసాద్ ఏపీకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. అక్కడి 10‌‌‌‌8 సిబ్బంది ఇచ్చిన సమాచారంతో శివప్రసాద్​ను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. దీంతో కొన్ని రోజులు అప్పు ఇచ్చినోళ్లు శివప్రసాద్​ను ఇబ్బంది పెట్టలేదు. కొన్ని నెలలుగా మళ్లీ అప్పులు బాధలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగారు.

ALSO READ : సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్.. ఇద్దరు నిందితులు అరెస్ట్

స్థానికులు గమనించి వారిని బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి మంచిర్యాలలోని జీజీహెచ్​కు రెఫర్ చేశారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్ డాక్టర్లు.. వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తాండూరు పోలీసులు తెలిపారు.